నాగా ఉగ్రవాదులపై ఆర్మీ మెరుపు దాడి

Wed,September 27, 2017 02:51 PM

Indian Army conducted Surgical Strike on Naga outfits in Indo Myanmar Border

న్యూఢిల్లీ: బుధవారం తెల్లవారుఝామున ఇండియన్ ఆర్మీ ఇండో, మయన్మార్ బోర్డర్‌లో మెరుపు దాడులు చేసింది. నాగా తీవ్రవాదుల శిబిరాలపై ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఇండియన్ పారా కమాండోలు ఈ దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాగా తీవ్రవాదుల శిబిరానికి భారీ నష్టం వాటిల్లినట్లు ఆర్మీ వెల్లడించింది. ఆర్మీ వైపు ఎలాంటి నష్టం జరగలేదని కూడా స్పష్టంచేసింది. గతేడాది ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ సర్జికల్ ైస్ట్రెక్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడుల్లో నియంత్రణ రేఖ దాటి వెళ్లిన ఆర్మీ.. ఈసారి మాత్రం సరిహద్దు దాటలేదని ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ స్పష్టంచేసింది. ఈ దాడులను కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కూడా ధృవీకరించారు. ఇది మన పొరుగు దేశాలకు ఓ హెచ్చరికలాంటిదని ఆయన చెప్పారు. 2001లో భారత ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసింది నాగా ఉగ్రవాద సంస్థ. అయితే 2015, మార్చి 27న ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. నాగాలాండ్, మణిపూర్‌లలోని భారత జవాన్లపై దాడులు చేశారు. జూన్ 4, 2015లో మణిపూర్‌లోని డోగ్రా రెజిమెంట్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేయగా 18 మంది సైనికులు మృత్యువాత పడ్డారు.
2328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles