పాకిస్థాన్‌పై అత్యాధునిక స్నైపర్ రైఫిల్స్‌తో ఇండియన్ ఆర్మీ ఎదురు దాడి

Wed,March 20, 2019 02:37 PM

Indian army attacking Pakistan Posts with state of the art Sniper Rifles

న్యూఢిల్లీ: పుల్వామా దాడి, ఆ తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులు ఇంకా హైఅలెర్ట్‌లోనే ఉన్నాయి. పాకిస్థాన్ రేంజర్లు పదేపదే కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్ప‌డుతున్నారు. నియంత్రణ రేఖ వెంబడి రోజూ కాల్పుల మోత మోగుతూనే ఉన్నది. దీంతో పాక్‌కు అదే రేంజ్‌లో బుద్ధి చెబుతున్నది ఇండియన్ ఆర్మీ. అత్యాధునిక స్నైపర్ రైఫిల్స్‌తో పాక్ పోస్టులపై దాడులు చేస్తున్నది. ప్రధానంగా రెండు స్నైపర్ రైఫిల్స్‌ను భారత జవాన్లు వాడుతున్నారు. అందులో ఒకటి ఫిన్నిష్ లాపువా మాగ్నమ్ కాగా.. మరొకటి ఇటాలియన్ కంపెనీ బెరెట్టా తయారు చేసిన రైఫిల్. అత్యవసరంగా ఈ రెండు రైఫిల్స్‌ను ఇండియన్ ఆర్మీ ఈ మధ్యే సమకూర్చుకుంది. నార్తర్న్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్‌కు ఇచ్చిన ఆర్థిక అధికారాల సాయంతో ఈ రైఫిల్స్‌ను నేరుగా కొనుగోలు చేశారు. ఈ స్నైపర్ రైఫిల్స్ పాక్ పోస్టులకు చేసిన నష్టమెంతో ఇంకా తెలియలేదు.

2310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles