వీడియో: పరస్పరం స్వీట్లు పంచుకున్న భారత్-పాక్ జవాన్లు

Wed,October 18, 2017 06:40 PM

Indian and Pakistani soldiers sharing sweets to each other at border

కదన రంగంలో ఇద్దరు కలిస్తే ఆ ప్రాంతమంతా భీతావాహమే. కాని.. పండుగ పూట మాత్రం ఇరు దేశాల సైనికులు కాసేపు ఇరుదేశాల గొడవలను పక్కన బెట్టారు. దీపావళి పండుగ సందర్భంగా భారత్ - పాక్ జవాన్లు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. భారత్ - పాక్ బోర్డర్‌లో భారత్ సైనికులు, పాక్ సైనికులు స్వీట్లు పంచుకొని దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముందుగా భారత్ సైనికులు.. పాక్ సైనికులకు స్వీట్లను అందివ్వగా.. తర్వాత పాక్ సైనికులు.. మన జవాన్లకు స్వీట్లు అందజేశారు. అలా.. రెండు పెద్ద స్వీట్ల బాక్సులను వాళ్లు పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే...

3330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS