చినూక్ హెలికాప్టర్లలో ఐఏఎఫ్ పైలట్ల శిక్షణ

Tue,October 16, 2018 10:34 AM

Indian Air Fore pilots training on Chinook helicopters

డెల్వేర్: అమెరికాకు చెందిన చినూక్ హెలికాప్టర్లు యుద్ధ సమయాల్లో చాలా ప్రత్యేకమైనవి. అయితే భారత వైమానిక దళానికి చెందిన పైలట్లు ఆ హెలికాప్టర్లలో శిక్షణ పొందుతున్నారు. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఐఏఎఫ్ సిబ్బంది శిక్షణ తీసుకుంటున్నారు. నలుగురు పైలట్లు, నలుగురు ఇంజినీర్లు .. చినూక్ హెలికాప్టర్లలో ట్రైనింగ్ తరగతలకు హాజరవుతున్నారు. అమెరికాలోని డెల్వేర్‌లో ఈ శిక్షణ జరుగుతున్నది. అత్యంత భారీగా ఉండే ఈ హెలికాప్టర్లను యుద్ధ సమాయాల్లో రవాణాకు వినియోగిస్తారు. జాతీయ విప‌త్తు స‌మ‌యంలోనూ ఈ హెలికాప్ట‌ర్ల‌ను విరివిగా వినియోగిస్తారు. అమెరికా నుంచి భారత్ మొత్తం 15 చినూక్ హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేస్తున్నది.

568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles