ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు: ప్రధాని మోదీ

Thu,February 28, 2019 01:08 PM

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. మేరా బూత్ సబ్‌సే మజ్‌బూత్ కార్యక్రమంలో భాగంగా ఇది ప్రపంచంలోనే ఇది అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ అని బీజేపీ చెప్పుకుంటున్నది. నమో యాప్ ద్వారా 15 వేల లొకేషన్స్ నుంచి మోదీ ప్రసంగాన్ని కార్యకర్తలు చూస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగంగా మాట్లాడారు. ఉగ్ర దాడుల ద్వారా పాకిస్థాన్.. భారత్‌ను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని మోదీ విమర్శించారు. ఇప్పుడు మనం అందరం సైనికుల్లాగే అలెర్ట్‌గా ఉండాలి. పాక్ మనల్ని అస్థిర పరచడానికి చూస్తున్నది. మన అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నది. కానీ దేశమంతా ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చి పాక్ దుష్ట ఆలోచనలను తిప్పి కొడుతున్నది అని మోదీ అన్నారు. ఇలాంటి సమయంలో భద్రతా బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బ తీసేలా ఎవరూ వ్యవహరించకూడదు. మన సైనికులు సరిహద్దులో, సరిహద్దు అవతల కూడా తన పరాక్రమాన్ని చూపించారు. ఇండియా ఒక్కటిగా జీవిస్తుంది.. ఒక్కటిగా పోరాడుతుంది.. ఒక్కటిగా గెలుస్తుంది.. ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు అని మోదీ స్పష్టం చేశారు.


4267
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles