సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తాం: ప‌్ర‌ధాని మోదీ

Mon,September 9, 2019 01:25 PM

India will ban single use plastic, World should too: PM Modi At UN COP14 Meet

హైద‌రాబాద్‌: కాన్ఫ‌రెన్స్ ఆఫ్ పార్టీస్ 14వ(సీఓపీ14) స‌ద‌స్సు ఇవాళ ఢిల్లీలో జ‌రిగింది. కంబాట్ డిస‌ర్టిఫికేష‌న్ అన్న అంశంపై యూఎన్ ఆధ్వ‌ర్యంలో ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ స‌దస్సులో ప్ర‌సంగించారు. సీఓపీ14 ల‌క్ష్యాల కోసం భార‌త్ క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. భూమి, జీవ‌వైవిధ్యంపై వాతావ‌ర‌ణం, ప‌ర్యావ‌ర‌ణం ప్ర‌భావం చూపుతాయ‌న్నారు. ప్ర‌పంచ దేశాల‌న్నీ వాతావ‌ర‌ణ మార్పు ప్ర‌భావాల‌ను ఎదుర్కొంటున్నాయ‌న్నారు. దీని వ‌ల్ల సార‌వంత‌మైన నేల కూడా త‌గ్గుతోంద‌న్నారు. స‌ముద్ర ప్రాంతాల్లో నీటిమ‌ట్టం పెర‌గ‌డం, అస్థిర వ‌ర్షాలు, ఇసుక తుఫాన్లు, వేడి వాతావ‌ర‌ణం లాంటి అంశాలు కూడా దీకిని కార‌ణ‌మ‌న్నారు. భూసారం త‌గ్గ‌కుండా ఉండాలంటే.. నీటిని ఒడిసిప‌ట్టుకోవాల‌న్నారు. భూమిలో తేమ‌ను కాపాడుకుంటేనే నేల స‌జీవంగా ఉంటుంద‌న్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాల‌ని త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు మోదీ చెప్పారు. ప్ర‌పంచ‌దేశాలు కూడా సింగిల్ యూజ్(వాడి ప‌డేసే) ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్సాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌న్నారు. భార‌త్‌లో గ‌త కొన్నేళ్ల‌లో వృక్షాల సంఖ్య పెరిగింద‌న్నారు. ఇది సంతోష‌క‌ర‌మైన విష‌య‌మ‌ని మోదీ తెలిపారు. 2015 నుంచి 2017 మ‌ధ్య వృక్షాల పెరుగుద‌ల 0.8 మిలియ‌న్ హెక్టార్లుగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 2030లోగా సుమారు 26 మిలియ‌న్ల హెక్టార్ల నేల‌ను మ‌ళ్లీ సార‌వంతం చేస్తాన‌న్నారు.714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles