విమానం పంపిస్తామన్న ఇండియా.. వద్దన్న పాకిస్థాన్!

Fri,March 1, 2019 12:55 PM

India wants to send special IAF flight for Abhinandan but Pakistan refused

న్యూఢిల్లీ: పాకిస్థాన్ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వాఘా బోర్డర్ ద్వారా ఇండియాకు రానున్నాడు. శాంతి చర్యల్లో భాగంగా అతన్ని భారత్‌కు అప్పగిస్తున్నట్లు గురువారం పాక్ పార్లమెంట్‌లో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అతన్ని తీసుకురావడానికి తాము ప్రత్యేకంగా విమానం పంపిస్తామని ఇండియా పాకిస్థాన్‌ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి పాకిస్థాన్ నిరాకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అతన్ని వాఘా సరిహద్దు ద్వారానే ఇండియాకు అప్పగిస్తామని పాక్ స్పష్టం చేసింది. అభినందన్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం ద్వారా ఇండియాకు తీసుకొచ్చి.. ముందుగా మెడికల్ చెకప్స్ చేయించి, తర్వాత అతని మిషన్ గురించి ప్రశ్నించాలని భారత్ భావించింది. వాఘా సరిహద్దు ద్వారా అతను ఇండియాకు వస్తే అభినందన్‌ను మీడియా చుట్టుముడుతుందని, అది తమకు ఇష్టం లేదని రక్షణ అధికారులు వెల్లడించారు.

6684
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles