ముందు మహిళా పోలీస్.. తర్వాత మగ పోలీస్.. ఓ ట్రాన్స్‌జెండర్ స్టోరీ

Fri,June 15, 2018 03:47 PM

India transgender officer rejoins duty after surgery in Maharashtra

ఆమె పేరు లలిత్ సాల్వే, వయసు 29. 2009లో మహారాష్ట్ర మహిళా కానిస్టేబుల్‌గా జాయిన్ అయింది. కాని.. తర్వాత కొన్ని రోజులకే తనకు ఎందుకో మహిళగా జీవించడం ఇష్టం లేదు. దీంతో పురుషుడిగా మారాలనుకుంది. పురుషుడిగా మారతానని.. తనను మగ పోలీస్‌గా గుర్తించాలని పోలీసులను వేడుకున్నది. కాని.. వాళ్లు కనికరించలేదు.

దీనిపై హైకోర్ట్‌లో అప్పీల్ చేసింది. మీడియా లలిత్‌పై ఫోకస్ చేయడంతో ఈ విషయం మహారాష్ట్ర సీఎం దాకా వెళ్లింది. దీంతో సీఎం లలిత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. లలిత్ లింగ మార్పిడి ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో గత నెల 25న లలిత్ లింగ మార్పిడి ఆపరేషన్ చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి స్థాయి పురుషుడిగా మారిపోయింది.. సారీ, మారిపోయాడు. ప్రస్తుతం మగ పోలీసుగా తిరిగి పోలీస్ శాఖలో జాయిన్ అయ్యాడు లలిత్.

"గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. నాకు అది గడ్డు కాలం. నాకు ఊపిరి కూడా ఆడలేదు. ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికే పురుషుడిగా మారాలనుకున్నాను. నేను గెలిచాను. ఆపరేషన్ తర్వాత నా సొంత గ్రామానికి వెళ్లాను. అంతా నన్ను అక్కున చేర్చుకున్నాను. నన్ను హీరోను చూసినట్లు చూశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నామీద వీళ్లంతా చూపిస్తున్న ప్రేమకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఒకప్పుడు నన్ను ద్వేషించిన వాళ్లూ ఉన్నారు.. నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్లూ ఉన్నారు. ఆపరేషన్ తర్వాత వాళ్లందరినీ కలిశాను. వాళ్లు నా బాధ, ఉద్వేగాన్ని అర్థం చేసుకున్నారు. నాకు అన్ని విధాలా సహాయ పడిన మీడియా, ముఖ్యమంత్రి, పోలీస్ డిపార్ట్‌మెంట్, నా ఫ్యామిలీ, అందరికీ కృతజ్ఞతలు.." అంటూ ముగించాడు లలిత్.

3426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles