అగ్ని-5 సక్సెస్..

Thu,January 18, 2018 03:41 PM

India successfully test fires Agni V missile

భువనేశ్వర్: దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని -5 క్షిపణిని ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ను ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ఐలాండ్ నుంచి ఫైర్ చేశారు. అత్యంత ఆధునికంగా తయారైన అగ్ని-5 పరీక్ష సక్సెస్ అయినట్లు రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. బీజింగ్‌లో ఉన్న టార్గెట్‌ను కూడా ఈ మిస్సైల్ చేధించగలదు అని అధికారులు చెబుతున్నారు. డీఆర్‌డీవో ఈ మిస్సైల్‌ను డెవలప్ చేసింది. అగ్ని సిరీస్‌లో అగ్ని-5 మోస్ట్ అడ్వాన్స్‌డ్ వర్షన్ కావడం విశేషం. అగ్ని క్షిపణి వ్యవస్థను డీఆర్‌డీవో 1960 నుంచి అభివృద్ధి చేస్తోన్నది. 2012, 2013, 2015, 2016లోనూ అగ్ని మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. అగ్ని మిస్సైల్ సుమారు 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా చేధించగలదు. చైనాలో ఉత్తర ప్రాంతాలను కూడా ఆ మిసైల్ చేరుకుంటుందని అధికారులు అంటున్నారు. సుమారు రెండు 1.5 టన్నుల బరువున్న అణ్వాయుధాలను కూడా అగ్ని-5 మోసుకువెళ్లగలదు. అగ్ని-5 సక్సెస్‌తో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా సరసన భారత్ నిలుస్తున్నది. అన్ని దేశాలకు ఇప్పుడు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణలు ఉన్నట్లే.

2133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles