ముందుగా పాక్ ఆ ప‌ని చేయాలి...

Thu,October 18, 2018 09:14 PM

India says that Pakistan should create conducive weather before peace talksన్యూఢిల్లీ : పాకిస్థాన్‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌గాలంటే, అంత‌క‌న్నా ముందు ఆ దేశం, దానికి అనువైన ప‌రిస్థితుల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంద‌ని భార‌త్ అభిప్రాయ‌ప‌డింది. విదేశాంగ శాఖ ప్ర‌తినిధి రావీష్‌ కుమార్ ఇవాళ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. చ‌ర్చ‌లు, ఉగ్ర‌వాదం ఒకే ప‌థంలో ముందుకు వెళ్ల‌వ‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. పాకిస్థాన్ ముందుగా త‌మ దేశంలో ఉన్న ఉగ్ర‌వాదుల‌ను ఏరివేయాల‌ని, ఆ త‌ర్వాత ఉగ్ర స్థావ‌రాల‌ను కూడా ధ్వంసం చేయాల‌ని భార‌త్ అభిప్రాయ‌ప‌డింది. రెండు దేశాల మ‌ధ్య అనువైన వాతావ‌ర‌ణం లేని కార‌ణంగానే న్యూయార్క్‌లో జ‌ర‌గాల్సిన విదేశాంగ మంత్రుల స‌మావేశం ర‌ద్దు అయిన‌ట్లు రావీష్‌ తెలిపారు. శాంతి చ‌ర్చ‌ల గురించి పాకిస్థాన్ నుంచి ఏదైనా స‌మాచారం అందిందా అని ప్ర‌శ్నించ‌గా, అలాంటిదేమీ లేద‌న్నారు.

3060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS