బాలీవుడ్ బీట్స్‌కు చిందేసిన పాక్, భారత్ జవాన్లు

Fri,August 31, 2018 03:16 PM

India, Pakistan troops dance to bollywood songs after anti terror drill

చిబర్కుల్: భారత, పాకిస్థాన్‌కు చెందిన ఆర్మీ జవాన్లు .. బాలీవుడ్ పాటలకు స్టెప్పులేశారు. తమ డ్యాన్స్‌తో శాంతి సందేశాన్ని వినిపించారు. రష్యాలో జరిగిన యాంటీ టెర్రర్ డ్రిల్‌లో పాల్గొన్న ఇరు దేశాల జవాన్లు.. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఫుల్ జోష్‌లో చిందేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రష్యాలోని చిబర్కుల్ పట్టణంలో జరిగిన డ్రిల్‌ను .. బీజింగ్‌కు చెందిన షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. న్యూఢిల్లీలో ఉన్న రష్యా దౌత్యకార్యాలయం కూడా ఆ వీడియోను ఉన్న ట్వీట్‌ను పోస్టు చేసింది. ఎస్‌సీవో సభ్యదేశాలు అయిన తర్వాత మొదటిసారి రెండు దేశాలు మిలిటరీ విన్యాసాల్లో పాల్గొన్నాయి. రష్యాకు చెందిన సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆధ్వర్యంలో సంయుక్త విన్యాసాలు జరిగాయి.
1471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles