25న ప్రారంభమవనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్

Mon,October 22, 2018 06:47 AM

india mobile congress to be launched on 25th October 2018

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీల అధిపతులు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు ఢిల్లీలో జరుగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) సదస్సులో టెలికం సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కులంకుశకంగా చర్చించనున్నట్లు తెలుస్తున్నది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి రిలయన్స్ జియో చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ హాజరవుతున్నారు. వీరితోపాటు వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. మూడు టెలికం దిగ్గజాల అధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఇండస్ట్రీ బాడీ సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మథ్యూ తెలిపారు. వీరితోపాటు ఆయా సంస్థలకు చెందిన చీఫ్ టెక్నాలజీ అధికారులు, చీఫ్ మార్కెటింగ్ అధికారులు తమ వ్యాపారానికి సంబంధించిన వాటిపై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సదస్సుకు అమెరికా, కెనడా, బ్రిటన్, యూరోపియన్ దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈసారి జరుగుతున్న సమావేశానికి అంతర్జాతీయ వేత్తలైన ఎఫ్‌సీయూ చైర్మన్ అజిత్ పాయ్, యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ అంద్రూస్ అన్సిప్‌లతోపాటు బీమ్స్‌టెక్ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. వీరితోపాటు కేంద్ర ప్రభుత్వం తరఫున టెలికం మంత్రి మనోజ్ సిన్హా, డీవోటీ కార్యదర్శి అరుణ సౌందరరాజన్, ఎంపిక చేసిన స్టార్టప్‌లు కూడా పాలుపంచుకుంటున్నాయి.

1190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles