వ‌ర్షం సాధార‌ణం.. దిగుబ‌డి పెర‌గ‌డం ఖాయం

Mon,February 25, 2019 05:11 PM

India may get normal monsoon this year, Skymet predicts high farm growth

హైద‌రాబాద్‌: రైతుల‌కు శుభ‌వార్త‌. ఈసారి రుతుప‌వ‌నాలు సాధార‌ణంగానే ఉండ‌నున్నాయి. దేశ‌వ్యాప్తంగా సాధార‌ణ స్థాయి వ‌ర్ష‌పాతం న‌మోదుకానున్న‌ది. స్కైమెట్ సంస్థ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో పంట దిగుబ‌డి కూడా అధికంగా ఉంటుంద‌ని పేర్కొన్న‌ది. ఆర్థిక ప్ర‌గ‌తి కూడా బాగానే ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా సాధార‌ణ వ‌ర్ష పాతం న‌మోద‌య్యే అవ‌కాశాలు 50 శాతం క‌న్నా ఎక్కువే ఉన్న‌ట్లు స్కైమెట్ సీఈవో జ‌తిన్ సింగ్ తెలిపారు. కొన్ని ప్ర‌దేశాల్లో మాత్ర‌మే అధిక వ‌ర్షం సూచ‌న ఉన్న‌ట్లు తెలిపారు. జూన్‌లో ప్రారంభం అయ్యే రుతుప‌వ‌నాల‌పై స్కైమెట్ సంస్థ ఈసారి మ‌రీ ముందుగానే వాతావ‌ర‌ణాన్ని అంచ‌నా వేసింది.

1999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles