ప్రతిభలో దిగజారిన భారత్

Tue,November 19, 2019 08:05 AM

న్యూఢిల్లీ: ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో ఈ ఏడాది భారత్ 59వ స్థానానికి దిగజారింది. గతేడాది 53వ స్థానంలో ఉండగా, ఈసారి 6 స్థానాలు చేజార్చుకున్నది. ముఖ్యంగా ప్రతిభావంతులను నిలుపుకోవడం, వారిని ఆకట్టుకోవడంలో భారత్ తీరు బాగోలేదని తాజా ర్యాంకులతో తేటతెల్లమైంది. చదువు, ఆరోగ్యం విషయంలోనూ భారత్ ప్రాధాన్యత తగ్గిపోయిందని తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా పెట్టుబడులు, అభివృద్ధి, అభ్యర్థన-సంసిద్ధతల ఆధారంగా విడుదలైన ఈ ర్యాంకుల్లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ అంతర్జాతీయ వార్జిక జాబితాలో మొత్తం 63 దేశాలుండగా, బ్రిక్స్ దేశాల్లో చైనా (42), రష్యా (47), దక్షిణాఫ్రికా (50) లు భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నా యి. జీవన ప్రమాణాలు, చదువు ఖర్చులు, నాణ్యమైన విద్య, కాలుష్యం తదితర అంశాల్లో ప్రతికూలతలు భారత్ ర్యాంక్ ను తగ్గించాయని స్విట్జర్లాండ్, సింగపూర్ ఐఎండీ బిజినెస్ స్కూల్ సీనియర్ ఆర్థికవేత్త జోస్ క్యాబల్లెరో తెలిపారు. ఆరోగ్య వ్యవస్థ, మహిళా కార్మికులు వంటి అంశాలూ ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ఇదిలావుంటే టాప్-10లో స్విట్జర్లాండ్ తర్వాతి స్థానాల్లో వరుసగా డెన్మార్క్, స్వీడన్, ఆస్ట్రియా, లగ్జెంబర్గ్, నార్వే, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, సింగపూర్ దేశాలున్నాయి.

521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles