ఓ మిగ్‌ను కోల్పోయాం.. పైలట్ కనిపించడం లేదు: భారత్

Wed,February 27, 2019 03:38 PM

India confirms one MiG plane was shot down and pilot is missing

న్యూఢిల్లీ: బాలాకోట్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడులకు ప్రతిగా బుధవారం ఉదయం పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానాలు భారత గగనతలంలోకి వచ్చి దాడికి ప్రయత్నించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి రవీష్‌కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో పాక్‌కు చెందిన ఓ ఎఫ్-16 విమానాన్ని కూల్చినట్లు ఆయన చెప్పారు. అయితే ఈ గందరగోళంలో ఓ మిగ్-21 ఫైటర్ జెట్ కనిపించకుండా పోయిందని ఆయన చెప్పారు. అందులోని పైలట్ కూడా వెనక్కి రాలేదని తెలిపారు. ఆ పైలట్ తమ ఆధీనంలో ఉన్నట్లు పాకిస్థాన్ చెబుతున్నదని, అందులో ఎంత వరకు వాస్తవం ఉందో చూస్తామని రవీష్ కుమార్ చెప్పారు. అయితే పైలట్ తమ ఆధీనంలో ఉన్నట్లు పాకిస్థాన్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం భారత్‌కు ఇవ్వలేదు.


7380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles