ఉగ్రవాదంపై పోరుకు భారత్, చిలీ ఒప్పందం

Tue,April 2, 2019 02:47 PM

India, Chile agree to work together to defeat terrorism

శాంటియాగో: ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమొందిచేందుకు భారత్, చిలీలు ఇకపై సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం చిలీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గనులు, సంస్కృతి, దివ్యాంగుల సాధికారతకు సంబంధించిన మూడు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఇండియా-చిలీ బిజినెస్ ఫోరంలో ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆర్థిక భాగ్యస్వామ్యం పెంపుదలకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. భారత్‌కు లాటిన్ అమెరికా ప్రాంతంలో చిలీ ఆరో అతిపెద్ద భాగస్వామి అన్నారు. చిలీ యూనివర్సిటీకి చెందిన యువ శాస్త్రవేత్తలతో రాష్ట్రపతి సమావేశమయ్యారు. క్రొయేషియా, బొలివియా, చిలీ దేశాల పర్యటనకు రాష్ట్రపతి బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి తిరుగు ప్రయాణంలో దక్షిణాఫ్రికాకు వెళ్లనున్నారు. సౌతాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు నివాళులర్పించనున్నారు. అదేవిధంగా అక్కడి భారత సంతతి ప్రజలను కలువనున్నారు.

799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles