ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు.. 2.5 కోట్ల న‌గ‌దు సీజ్‌

Sat,March 9, 2019 09:46 AM

Income Tax raids continue at AAP MLA Naresh Balyans residence, Rs 2.5 crores seizedహైద‌రాబాద్‌: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే న‌రేశ్ బాల్య‌న్ నివాసంలో ఇవాళ ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. శుక్ర‌వారం రాత్రి నుంచి సోదాలు జ‌రుగుతున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. త‌నిఖీల్లో మొత్తం 2.5 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఉత్త‌మ్‌న‌గ‌ర్‌లో ఉన్న ఆఫీసు, ఇంట్లో సోదాలు జ‌రుగుతున్నాయి. గ‌తంలో ఎమ్మెల్యే బాల్య‌న్‌పై ఓ కేసు న‌మోదు అయ్యింది. ఢిల్లీ చీఫ్ సెక్ర‌ట‌రీపై ఆయ‌న అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. 2015లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ బాల్య‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో అధికారుల భారీ ఎత్తున లిక్క‌ర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

4338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles