మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో ఐటీ సోదాలు

Thu,October 10, 2019 11:16 AM

హైద‌రాబాద్‌: క‌ర్నాట‌క మాజీ డిప్యూటీ సీఎం జీ ప‌ర‌మేశ్వ‌ర నివాసాల్లో ఇవాళ ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. సుమారు 30 ప్ర‌దేశాల్లో ఐటీ శాఖ త‌నిఖీలు జ‌రుపుతున్న‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం ద్వారా తెలుస్తోంది. ప‌ర‌మేశ్వ‌ర‌కు చెందిన ట్ర‌స్టు ఓ మెడిక‌ల్ కాలేజీని నిర్వ‌హిస్తున్న‌ది. ఆ కాలేజీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో ఐటీశాఖ దాడులు చేస్తున్న‌ట్లు స‌మాచారం.సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్‌టిట్యూష‌న్స్ ఓన‌ర్ ప‌ర‌మేశ్వ‌ర‌. అయితే తుమ‌కూరులో ఉన్న ఆ విద్యాసంస్థ‌లో న‌లుగురు స‌భ్యుల ఐటీ బృందాలు సోదాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. ఐటీ దాడుల‌ను క‌ర్నాట‌క ప్ర‌తిప‌క్ష నేత సిద్ధ‌రామ‌య్య ఖండించారు. రాజ‌కీయ దురుద్దేశంతో ఈ దాడులు చేసిన‌ట్లు ఆరోపించారు.


త‌న ఆఫీసుల‌పై జ‌రుగుతున్న దాడుల ప‌ట్ల ప‌ర‌మేశ్వ‌ర స్పందించారు. అయితే దాడుల గురించి త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఎక్క‌డ దాడులు జ‌రుగుతున్నాయో త‌న‌కు ఎటువంటి స‌మాచారం లేద‌న్నారు. ఐటీ సోదాలు చేసినా త‌న‌కేమీ ఇబ్బందిలేద‌న్నారు. త‌న నుంచి ఎటువంటి త‌ప్పిదం ఉన్నా.. దాన్ని స‌రిచేసుకుంటామ‌ని ప‌ర‌మేశ్వ‌ర తెలిపారు.

1067
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles