ఆ ఊళ్లో పేరుపెట్టి పిలవరు.. రాగం తీస్తారు

Tue,September 25, 2018 06:29 PM

in that village people call others by tune

ఇటీవల ఈలల భాష వీడియో వైరల్ అయింది. టర్కీలోని కొండప్రాంతాల్లో ఈ భాషను విరివిగా ఉపయోగిస్తారు. అక్కడంతా ఈలపాట రఘురామయ్యలే. బాగున్నారా అని అడగడానికి ఓరకం.. భోంచేశారా అని అడగడానికి మరోరకం.. టీ తాగడానికి వస్తారా అని పిలవడానికి ఇంకో రకం.. ఇలా అన్ని అవసరాలకు ఈలపాటలుంటాయి. అంతగా అభివృద్ధి చెందింది వారి ఈల భాష. ఇప్పుడు అలాంటిదే ఇంకో సంగతి బైటపడింది. ఇది మనకు తెలియని మన కథ. నిజానికి మనదేశంలో ఎంత వైవిధ్యం ఉందో మనకే తెలియదు. మేఘాలయ రాష్ట్రంలోని కొంథొంగ్ అనే ఓ ఊళ్లో ఒకరినొకరు పిలుచుకోవాలంటే చిన్న ఆలాపన చేస్తారు. అంటే పేరుకు బదులుగా ఓ ట్యూన్ వినిపిస్తారు. పైగా ప్రతి ఒక్కరికీ విడివిడిగా ట్యూన్లు ఉంటాయి. ప్రతి తల్లి బిడ్డ పుట్టగానే ఓ ట్యూన్ కడుతుంది. అదే అతడు లేదా ఆమెకు నామస్వరం అవుతుంది. తల్లి ఆట్యూను బిడ్డకు అలవాటు చేస్తుంది. తర్వాత అందరూ అదే ట్యూనుతో పిలుస్తారు. అదీ పద్ధతి. అసలు పేర్లు ఉండవని కాదు. ఉంటాయి, కేవలం రికార్డుల కోసం. ఈ ట్యూన్ల సాంప్రదాయం అనాదిగా వస్తుందని ఊరోళ్లు చెప్తారు. జన్మనిచ్చిన అమ్మకట్టిన ట్యూను కదా అందరికీ ఇష్టమేనట.


3634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles