ఢిల్లీ ఆత్మహత్యలు.. కాబోయే భర్తను ప్రశ్నించిన పోలీసులు

Tue,July 10, 2018 11:22 AM

In Delhi family hangings, womans fiance questioned for three hours

న్యూఢిల్లీ: ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సంచలన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 200 మందిని పోలీసులు విచారించారు. మృతులకు సంబంధించిన తుది పోస్టుమార్టమ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. భాటియా ఫ్యామిలీ మోక్షం కోసం బద్ తపస్య ప్రక్రియ ద్వారా ప్రాణ త్యాగం చేసిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. మృతుల్లో ఒకరైన 33 ఏళ్ల ప్రియాంకా భాటియా కాబోయే భర్తను కూడా విచారించారు. ఈమధ్యనే ప్రియాంకాకు ఎంగేజ్‌మెంట్ అయ్యింది. అయితే భాటియా ఇంట్లో ఇలాంటి ఆచారాలు ఉన్నట్లు తనకు తెలియదని ప్రియాంకా కాబోయే భర్త చెప్పాడు. సుమారు మూడు గంటల పాటు ఆయన్ను విచారించారు. కానీ ప్రియాంకకు కుజదోషముందని పోలీసులు గుర్తించారు. దాని వల్లే ఆమెకు పెళ్లి సంబంధాలు కుదరలేదని గ్రహించారు. జూన్ 1న 11 మందిలో 10 మంది ఉరి వేసుకుని బలవన్మరాణానికి పాల్పడ్డారు. 77 ఏళ్ల నారాయణ దేవి మృతదేహం మాత్రం ఓ రూమ్‌లో పడి ఉన్నది. నారాయణ దేవి కూతురు 57 ఏళ్ల ప్రతిభ, ఆమె ఇద్దరు కుమారులు 50 ఏళ్ల భవ్‌నేశ్, 45 ఏళ్ల లలిత్ కూడా చనిపోయారు. భవ్‌నేశ్ భార్య 48 ఏళ్ల సవిత, ఆమె ముగ్గురు పిల్లలు మేనక(23), నీతూ(25), ధీరేంద్ర(15) కూడా మరణించారు. లలిత్ భాటియా భార్య 42 ఏళ్ల టీనా, ఆమె 15 ఏళ్ల కుమారుడు దుశ్యంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిభ కుమార్తె ప్రియాంకకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివరలోగా ఆమె పెళ్లి చేసుకోవాలనుకున్నది.

2000
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles