ఇమ్రాన్ కూడా మిలిటరీ ఆదేశాలు పాటించాల్సిందే..

Thu,July 26, 2018 11:51 AM

Imran Khan has to follow Pakistan military, says Shashi Tharoor

న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. పాక్‌లో మార్పు కావాలని ఆ దేశ మిలిటరీ గత ఏడాది కాలం నుంచి ఆశిస్తోందని, నవాజ్ షరీఫ్‌ను ఓడించాలన్న ఉద్దేశంతోనే ఆర్మీ పనిచేసిందని, అందువల్లే ఇమ్రాన్ ఖాన్‌ను ప్రత్యర్థిగా మిలిటరీ చూసుకున్నదని థరూర్ తెలిపారు. ప్రస్తుతం జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి 113 సీట్లు వచ్చాయి. అయితే ఇమ్రాన్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే స్వతంత్ర అభ్యర్థుల సాయం అవసరం. స్వతంత్ర విజేతలు మిలిటరీ ఆదేశాలను పాటిస్తారని, దాని ప్రకారమే ఇమ్రాన్ కూడా తన ప్రణాళికలను రచిస్తుంటారని శశి అన్నారు. ఒక రకంగా ప్రస్తుతం ఫలితాలు పాక్ మిలిటరీకి అనుకూలంగా వచ్చాయని అన్నారు. పాక్‌లో ఏ ప్రభుత్వం ఏర్పడినా, వాళ్లు మిలిటరీ ఆదేశాలను జవదాటరు, కాబట్టి పాక్‌లో ఇమ్రాన్ రాకతో మార్పు జరుగుతుందని ఆశించడం లేదని థరూర్ అభిప్రాయపడ్డారు.2126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles