ఆకట్టుకుంటున్న స్పెషల్ టూర్స్

Mon,May 21, 2018 08:12 AM

Impressive special tours in India

ఉద్యోగం, ఇళ్లు లాంటి ఉక్కిరి బిక్కిరి పనుల్లోంచి కాసింత ఊర ట లభిస్తే.. దూరతీరాలకు పారిపోవాలనిపిస్తుంది. అలా వెళ్లడ మంటే... కొత్త ప్రపంచాన్ని వీక్షించడం. ప్రకృతితో కాసేపు ఊసులాడడం. కొత్త మనుషుల్ని, కొత్త జీవన సంస్కృతిని తెలుసుకోవడం. అలాంటి అహ్లాదకరమైన పర్యటన కోసం ఆకట్టుకునే ప్యాకేజీలను అందిస్తోంది లగ్జరీ ట్రైన్స్. మీరూ అలాంటి టూర్ ప్లాన్ చేసుకోదలుచుకుంటే... www. indian luxurytrains.com ని విజిట్ చేయవచ్చు.

కశ్మీర్ టూర్


కశ్మీర్... అహ్లాదకరమైన పర్యాటక ప్రాంతం. మనోహరమైన ప్ర కృతి అందాలు, దాల్ సరస్సు, మంచు కొండలు, పడవ ప్రయా ణం ఇలా ఎన్నెన్నో అందాలు మది దోచుకుంటాయి. దేశ, విదేశీ పర్యాటకుల ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ కశ్మీర్. అందు కే...ఎన్నిసార్లు ఆ నేలను సందర్శించినా మళ్లీ మళ్లీ చూడాలని పిస్తుంది. ఈ వేసవి కాసింత ఉపశమనం కావాలంటే కశ్మీర్ కంటే సరైన పర్యాటక ప్రాంతం కనిపించదేమో. అంతేకాదు.. కశ్మీరీ ప్రజల జీవన విధానం, సంస్కృతి అదనపు ఆకర్షణ. ఢిల్లీ నుంచి పలు ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలు అందుభాటులో ఉన్నాయి. వారం రోజుల టూర్‌లో ఢిల్లీ - శ్రీనగర్ - గుల్‌మార్గ్ - పహల్గామ్ - ఢిల్లీ ప్రాంతాలను సందర్శించవచ్చు.

అండమాన్ టూర్


సముద్ర తీరంలో సేదతీరాలనిపిస్తే... అండమాన్‌లాంటి ప్రాం తాన్ని సందర్శించాల్సిందే. సముద్ర ద్వీపంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ఈ ప్రాంతం నిత్యం వేలాది మంది పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. పోర్ట్, హావ్‌లాక్ ఐస్ లాడ్ తప్పని సరిగా సందర్శించాల్సిన ప్రదేశాలు. ఇండియన్ లగ్జరీ ట్రైన్స్ అండమాన్ ద్వీపానికి 7 రోజుల ప్రత్యేక ప్యాకేజీని నిర్వహిస్తోంది. మర్చిపోలేని అనుభూతుల్ని సొంతం చేసే ఈ టూర్‌లో మీకు సరైన ప్యాకేజీని ఎంచుకుకోవచ్చు.

లడక్ టూర్


కొండలు, ప్రకృతి అందాలతో ఆకట్టుకునే పర్యాటక ప్రాంతం లడక్. అతి రమణీయమైన ఈ ప్రాంత తప్పక సందర్శించా ల్సంది. ఆల్చి మఠం. లడక్ అనగానే త్సోకర్ సరస్సు, త్సో మోరిరి సరస్సు, నర్బ వ్యాలీ, ఖార్ధుంగ్లా పాస్, పనగాంగ్ సర స్సు లాంటి అనేక ఆకర్షణీయమైన ప్రాంతాలు గుర్తుకువస్తాయి.
విహారయాత్రను ఎంజాయ్ చేయాలనుకుంటే లడక్‌ని విజిట్ చేయాల్సిందే లగ్జరీ ట్రైన్స్ ఢిల్లీ నుంచి 8 రోజుల ప్రత్యేక ప్యాకేజీని నిర్వహిస్తోంది.


1031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles