దేవుడా.. న‌న్నెందుకు సీఎంను చేశావు !

Fri,July 19, 2019 01:22 PM

Im still asking God why he made me chief minister, says Kumaraswamy

హైద‌రాబాద్‌: క‌ర్నాట‌క అసెంబ్లీలో ఇవాళ సీఎం కుమార‌స్వామి మాట్లాడారు. బ‌ల‌ప‌రీక్ష తీర్మానం సంద‌ర్భంగా ఇవాళ రెండ‌వ రోజు కూడా సీఎం మాట్లాడారు. మీరే సీఎం కావాలంటూ త‌న‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, తాను ఎవ‌రి ద‌గ్గ‌రికీ వెళ్ల‌లేద‌న్నారు. సీఎం పీఠం త‌న‌కు ముఖ్య‌మైంది కాద‌ని, కానీ భ‌విష్య‌త్తు త‌రాల‌కు కీల‌కం అన్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగేందుకుకే మ‌న స్వాతంత్ర్య స‌ర‌మ‌యోధులు ప్ర‌జాస్వామ్యాన్ని రూపొందించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌న‌ను ఎందుకు సీఎంను చేశావ‌ని దేవుణ్ని అడుగుతున్నాని, ఇది నిజంగా త‌ల‌రాతే అన్నారు. బ‌ల‌ప‌రీక్ష‌పై చ‌ర్చ చేప‌డుదామ‌ని, మీరే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయండి, ఇందులో తొంద‌రెందుకు అని బీజేపీని ఉద్దేశిస్తూ సీఎం కామెంట్ చేశారు. సీఎం అధికారాల‌ను దుర్వినియోగం చేయ‌న‌న్నారు. త‌మ కూట‌మి ఎమ్మెల్యేల‌కు ఒక్కొక్క‌రికి 50 కోట్లు లంచం ఇచ్చార‌ని, అది ఎవ‌రి సొమ్ము అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇవాళ కూడా 20 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజ‌రు అయ్యారు. త‌న‌ను ఎవ‌రూ కిడ్నాప్ చేయ‌లేద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ తెలిపారు. హెల్త్ చెక‌ప్ కోసం ముందు చెన్నై వెళ్లి.. అక్క‌డ నుంచి ముంబైకి వ‌చ్చిన‌ట్లు ఎమ్మెల్యే పాటిల్‌.. స్పీక‌ర్‌కు లేఖ ద్వారా తెలిపారు.

4386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles