అక్రమ గనులు.. వంద కోట్ల జరిమానా

Sat,January 5, 2019 11:09 AM

Illegal mining : NGT imposes Rs.100 crore fine on Meghalaya government

న్యూఢిల్లీ: మేఘాలయా రాష్ట్ర ప్రభుత్వంపై .. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా విధించింది. రాష్ట్రంలో ఉన్న అక్రమ మైనింగ్ వ్యాపారాలను ప్రభుత్వం అడ్డుకోలేకపోతున్నదని ఎన్జీటీ కోర్టు పేర్కొన్నది. ఎక్కువ శాతం గనులు లైసెన్సు లేకుండా తొవ్వకాలు నిర్వహిస్తున్నాయని ఓ హైలెవల్ కమిటీ తన రిపోర్ట్‌లో అభిప్రాయపడింది. 20 రోజుల క్రితం రాష్ట్రంలోని ర్యాట్ హోల్ బొగ్గు గనిలో సుమారు 13 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ పనులు కొనసాగుతున్నాయి. బీపీ కకోటి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ మేఘాలయాలో ఉన్న గనులపై రిపోర్టు ఇచ్చింది. ఆ రాష్ట్రంలో సుమారు 24 వేల గనులు ఉన్నాయని ఆ కమిటీ వెల్లడించింది. అందులో ఎక్కువ శాతం గనులను అక్రమంగా నిర్వహిస్తున్నారు.

941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles