అందుకే నాకు కోల్‌కతా అంటే ఇష్టం.. వైరల్ స్టోరీ..!

Fri,June 15, 2018 05:26 PM

IIM professor salutes Kolkata residents who helped his injured son

నిజానికి ఇది స్టోరీ కాదు.. జీవితం. సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నది. బావోద్వేగాలతో కూడుకున్న స్టోరీ ఇది. ఐఐఎమ్ ప్రొఫెసర్ అలోక్ కుమార్ ఈ స్టోరీని తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశాడు. కోల్‌కతా ప్రజలను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే డౌట్లు మీకు వచ్చే ఉంటాయి. అందుకే ఆయన మాటల్లోనే చదువుదాం పదండి..

"నాకొడుకు పేరు అభిషేక్. లాల్ బజార్‌లోని మెట్ కాల్ఫీ స్ట్రీట్‌లో ఉన్న పార్శీ ఫైర్ టెంపుల్ నుంచి తన స్కూటీ మీద ఇంటికి వస్తున్నాడు. దురదృష్టవశాత్తు వర్జీనియా హౌజ్ ఎదురుగా.. జవహర్ లాల్ నెహ్రూ రోడ్డు దగ్గర ఉన్న వంతెనను దిగుతుండగా వేగంగా వస్తున్న ఓ స్కూల్ బస్సు మావాడి స్కూటీని ఢీకొట్టింది. దీంతో అభిషేక్ ఎగిరి కిందపడ్డాడు. అభిషేక్ హెల్మెట్ పెట్టుకొని ఉన్నా.. హెల్మెట్‌కు రోడ్డు బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. 5 నుంచి 7 నిమిషాల వరకు అతడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇంతలోనే స్థానికులంతా అక్కడ గుమికూడారు. వెంటనే కొన్ని మంచినీళ్లు అందించి అతడికి స్పృహ వచ్చేలా చేశారు. రోడ్డు మీద పడి ఉన్న స్కూటీని తీసి పక్కన పార్క్ చేశారు. కొంతమంది అభిషేక్‌ను దగ్గర్లోని ఎస్‌ఎస్‌కేఎమ్ ఆసుపత్రికి తరలించాలనుకున్నారు.

కాని.. అభిషేక్ మాత్రం.. నాకు ఫోన్ చేయాలని చెప్పాడు. కొంతమంది 100 నెంబర్‌కు ఫోన్ చేశారు. నాకూ ఫోన్ చేశారు. వెంటనే ఇంటికి రావాలన్నారు. దీంతో నేను వెంటనే ఇంటికి వెళ్లాను. అభిషేక్‌ను కూడా టాక్సీలో ఇంటికి తీసుకొచ్చారు. నేను వచ్చేదాకా వాళ్లు మా ఇంట్లోనే వెయిట్ చేశారు. నేను వచ్చాక అభిషేక్‌ను శ్రీ అరబిందో సేవా కేంద్రకు తీసుకెళ్లాను. వెంటనే డాక్టర్లు సిటీ స్కాన్ తీశారు. ఎక్స్‌రే తీశారు. వాళ్లు డబ్బుల గురించి అడగకుండానే ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. డబ్బుల కట్టాలని నన్ను ఒత్తిడి చేయలేదు. 24 గంటల తర్వాత నెమ్మదిగా అభిషేక్ కోలుకోవడం ప్రారంభించాడు. పోలీసులు కూడా చాలా మర్యాదగా ప్రవర్తించారు. ఈ ప్రమాదంపై నేను షేక్‌స్పియర్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వలేనని పోలీసులు చెప్పాను. దానికి వాళ్లు నన్ను ఏమీ అనలేదు. అభిషేక్ స్కూటీని కూడా సేఫ్ ప్లేస్‌లో పార్క్ చేశారు. తర్వాత నేను వెళ్లి తీసుకొచ్చాను.

అసలు.. వీళ్లంతా ఎవరు? వీళ్లలో ఒక్కరు కూడా నాకు తెలియదు. వాళ్ల ముఖం కూడా నేను చూడలేదు. ఎటువంటి బంధం లేకుండానే వాళ్ల సమయాన్ని వృథా చేసుకొని మరీ.. మా అబ్బాయికి సహాయం చేశారు. అంతే కాదు.. పోలీసులను పిలిచారు, నాకు ఫోన్ చేశారు, నా కొడుకును ఇంటికి తీసుకొచ్చారు. టాక్సీ డబ్బులు కూడా వాళ్లే కట్టారు. అందుకే.. నాకు కోల్‌కతా అంటే ఇష్టం. నాకు తెలిసిన కోల్‌కతా ఇదే. అందుకే నేను కోల్‌కతాలో ఉంటున్నాను. అందరికీ కృతజ్ఞత‌లు.." అంటూ ముగించాడు అలోక్ కుమార్.

2915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles