మాల్యా రుణం ర‌ద్దు చేస్తే.. నాదీ చేయండి..!

Sun,November 20, 2016 03:15 PM

If Vijay Mallaya Can Why Can not I, Safai Worker Seeks Loan Waive Off

ముంబై: సామాన్యుడి క‌డుపు మండింది.. కోట్లు కొల్ల‌గొట్టే దొంగ కోటీశ్వ‌రులు తీసుకొనే రుణాల‌ను మాఫీ చేస్తారుగానీ.. త‌న‌ది చేయ‌రా అంటూ నిల‌దీశాడు. మాల్యా రుణాలు మాఫీ చేసిన‌ట్లు త‌న ల‌క్ష‌న్న‌ర రుణాన్ని మాఫీ చేయాల‌ని ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే లేఖ రాశాడ‌త‌డు. మ‌హారాష్ట్రలోని త్ర‌యంబ‌కేశ్వ‌ర్ మున్సిప‌ల్ కౌన్సిల్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా ప‌నిచేస్తున్న భావురావ్ సోనావానె త‌న రుణాన్ని ర‌ద్దు చేయాలంటూ ఎస్‌బీఐకి లేఖ రాయ‌డం విశేషం. అవును.. నేను బ్యాంక్‌కు లేఖ రాశాను. మాల్యా లోను ర‌ద్దు చేసినందుకు వారికి శుభాకాంక్ష‌లు తెలిపాను. నా లోన్ కూడా ర‌ద్దు చేయాల్సిందిగా బ్యాంకు వారిని కోరాను అని సోనావానె తెలిపాడు.

త‌న కొడుకుకు చికిత్స చేయించ‌డం కోసం ల‌క్ష‌న్న‌ర రుణం తీసుకున్న‌ట్లు అత‌ను చెప్పాడు. తన లేఖ‌పై బ్యాంక్ మేనేజ‌ర్ ఇంకా స్పందించ‌లేద‌ని తెలిపాడు. విజ‌య్ మాల్యా త‌న కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ కోసం ఎస్‌బీఐలో తీసుకున్న 1200 కోట్ల రుణాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆ బ్యాంక్ త‌న లెక్క‌ల్లో చూపిన విష‌యం మీడియాలో రావ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఓవైపు న‌ల్ల‌ధ‌నంపై పోరంటూనే మ‌రోవైపు బ‌డా పారిశ్రామిక వేత్త‌ల రుణాలు ర‌ద్దు చేయ‌డ‌మేంట‌న్న నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ రాజ్య‌స‌భ‌లో వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. రైట్ ఆఫ్ అంటే ర‌ద్దు కాద‌ని, రుణ వ‌సూలుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

3107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles