Telangana Intermediate 1st & 2nd Year Results 2019

నేను స్పీచ్ ఇస్తే.. కాంగ్రెస్‌కు ఓటు వేయరు

Tue,October 16, 2018 05:00 PM

If I Speak Congress Loses Votes says Digvijaya Singh

న్యూఢిల్లీ : తాను స్పీచ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయరు.. తమ పార్టీకి తన ప్రసంగంతో నష్టమే తప్ప లాభం లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. అందుకే మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నానని తెలిపారు. టికెట్ పొందిన ప్రతి అభ్యర్థిని.. శత్రువైనప్పటికీ గెలిపించుకునేందుకు కృషి చేస్తామన్నారు. అభ్యర్థుల గెలుపుపై దృష్టి సారిస్తాను. కానీ పబ్లిక్‌గా మాట్లాడటం.. పని చేయడం మానుకున్నానని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పని చేయాలని దిగ్విజయ్ పిలుపునిచ్చారు.

మధ్యప్రదేశ్ శాసనసభకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 28న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 2న విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 9, ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 14.

4614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles