బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి ప్రమాదం

Fri,April 26, 2019 10:35 AM

If BJP returns to power it will break the country unity says Amarinder Singh

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుందని.. దీని వల్ల దేశానికి ప్రమాదం పొంచి ఉంటుందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. అయితే మోదీని ప్రజలు విశ్వసించడం లేదని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ సాధిస్తుందని.. దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని పంజాబ్ సీఎం స్పష్టం చేశారు. పంజాబ్‌లో 13 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో మన జవాన్లు ప్రతి రోజు ప్రాణాలు కోల్పోతున్నారు. జవాన్ల త్యాగాలను మోదీ రాజకీయంగా వాడుకుంటున్నారని అమరీందర్ సింగ్ ధ్వజమెత్తారు. ఈ ఐదేళ్లలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం.. పుల్వామా ఉగ్రదాడి అనంతరం జరిగిన పరిమాణాలను తెరపైకి తీసుకువస్తుంది. కానీ దేశ ప్రజలకు ఏం చేశామన్నది మాత్రం మోదీ చెప్పడం లేదని సీఎం అమరీందర్ సింగ్ నిప్పులు చెరిగారు.

1419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles