దోషిగా తేల‌కుండా ఆస్తులు ఎలా జప్తు చేస్తారు ?

Wed,July 25, 2018 05:59 PM

if a person is not guilty, how his property confiscated, asks Prasanna Acharya of BJD

ఆర్థిక నేర‌గాళ్ల బిల్లును ఆమోదించిన రాజ్య‌స‌భ‌

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు ఎవరు ? వాళ్లను ఎలా నిర్వచిస్తారు. రాజ్యసభలో ఇవాళ ప్రవేశపెట్టిన ఆర్థిక నేరగాళ్ల బిల్లులో ఓ క్లారిటీ ఇచ్చారు. ఆ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం .. ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయాలంటూ దేశంలోని ఏ కోర్టు అయినా వారెంట్ జారీ చేస్తుంది. కోర్టులో నేరాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని దేశాన్ని విడిచి వెళ్లిన వారు ఆ జాబితాలోకే వస్తారు. భారత్‌కు వచ్చేందుకు నిరాకరించే నేరగాళ్లు కూడా ఆర్థిక నేరస్తుడిగా నిలుస్తాడు.

ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ రాజ్యసభలో ఆర్థిక నేరగాళ్ల బిల్లును ప్రవేశపెట్టారు. పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టుకుని తీసుకురావడమే బిల్లు ఉద్దేశమని మంత్రి తెలిపారు. ఆర్థిక నేరగాళ్లను దేశం విడిచి వెళ్లకుండా కూడా కొత్త చట్టాలు పనిచేస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు.. ఆర్థిక నేరగాళ్లను పటిష్టంగా బంధించలేకపోతున్నాయని మంత్రి గోయల్ తెలిపారు. బిల్లులో ఉన్న అనేక అంశాలను ఆయన సభలో చదవి వినిపించారు.

బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా సభలో కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు. ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను జప్తు చేస్తారా, దేశం విడిచి వెళ్లిన వారిని వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ వివేక్ తనక్ మాట్లాడుతూ.. కేవలం 10 శాతం నల్లధనం మాత్రమే దేశం బయట ఉన్నట్లు తెలిపారు. ఆ డబ్బును వెనక్కి తెచ్చేందుకు ప్రభుత్వం ఏం చేసిందని ఆయన అడిగారు. వంద కోట్ల స్కామ్ చేస్తేనే ఆర్థిక నేరగాళ్లు అవుతారా అని ఆయన ప్రశ్నించారు. ఆస్తులను జప్తు చేస్తే, ఆర్థిక నేరగాళ్లు తిరిగి దేశానికి ఎందుకు వస్తారని ఆయన అడిగారు.బిల్లును స్వాగతిస్తున్నామని కానీ దాంట్లో ఇంకా మార్పులు అవసరమని కాంగ్రెస్ ఎంపీ అన్నారు.

కఠినమైన చట్టాలు చేసినంత మాత్రాన నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేమని బీజేపీ ఎంపీ భూపేంద్ర యాదవ్ అన్నారు. నల్లకుబేరులపై సిట్ వేయడాన్ని ఆయన సమర్థించారు. ఇప్పటివరకు 31 మంది ఆర్థిక నేరగాళ్లు దేశాన్ని విడిచి వెళ్లినట్లు ఎంపీ యాదవ్ తెలిపారు.ఆర్థిక నేరగాళ్ల బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ తెలిపారు. కానీ చట్టాలను దుర్వినియోగం చేస్తారేమో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయవేత్తలపై కక్ష్య సాధింపు కోసం ఆ చట్టాలను వాడుతున్నారని ఆరోపించారు.వరుసగా మూడు సార్లు కోర్టుకు హాజరు కాని వాళ్లను కూడా ఆర్థిక నేరగాళ్లుగా పరిగణించాలని అన్నాడీఎంకే ఎంపీ నవనీతకృష్ణన్ తెలిపారు.దోషిగా తేల్చుకుండానే ఏ వ్యక్తినీ శిక్షించలేమని, ఆర్థిక నేరగాళ్ల బిల్లు ప్రస్తుత చట్టాలను ఎలా ఎదుర్కొంటుందని బీజేడీ ఎంపీ ప్రసన్న ఆచార్య ప్రశ్నించారు.చట్టం ముందు అపరాధిగా తేలకుండానే ఆస్తులను ఎలా స్వాధీనం చేసుకుంటారని కూడా ఆయన అడిగారు.

ఆర్థిక నేర‌గాళ్ల బిల్లు ప్ర‌కారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ అధికారులు విచార‌ణ చేప‌డుతార‌ని మంత్రి గోయ‌ల్ తెలిపారు. చిట్ట‌చివ‌ర‌కు రాజ్య‌స‌భ‌లో ఆర్థిక నేర‌గాళ్ల బిల్లుకు ఆమోదం ద‌క్కింది. అవినీతిని అరిక‌ట్టాల‌న్న ఉద్దేశంతోనే బిల్లును తెచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. నేర‌గాళ్ల అప్ప‌గింత‌కు సంబంధించి సుమారు 48 దేశాల‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

2480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS