ఐసీఐసీఐ బ్యాంక్‌కు సుప్రీంకోర్టు షాక్!

Mon,October 8, 2018 05:53 PM

న్యూఢిల్లీ: నేషనల్ కన్జూమర్ కమిషన్‌లో రూ.పది కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ బ్యాంక్ మేనేజర్ ఓ కోఆపరేటివ్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. కన్జూమర్ కమిషన్ ఆర్డర్‌పై స్టే విధించేందుకు జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. బ్యాంక్ ఆ డిపాజిట్ చేసిన తర్వాతే దానిని పరిశీలిస్తామని తేల్చి చెప్పింది. బ్యాంక్‌పై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోకుండా ఉండేందుకే ఈ డిపాజిట్ అని కూడా కోర్టు తెలిపింది. రెండు వారాల్లోగా ఈ డిపాజిట్ చేయాలి. అలా చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోం అని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.

ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్‌కు వడ్డీ సహా రూ.10 కోట్లు చెల్లించాలని ఈ ఏడాది మార్చిలో కన్జూమర్ కమిషన్ ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్టే విధించాలంటూ ఐసీఐసీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. గతంలో ఇదే కోఆపరేటివ్ బ్యాంక్ ఐసీఐసీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో డబ్బును పెట్టుబడిగా పెట్టింది. అయితే ఆ బ్యాంక్ మేనేజర్ నకిలీ పత్రాలతో ఆ డబ్బును కాజేశాడు. ఈ కేసులో కోఆపరేటివ్ బ్యాంక్ వినియోగదారుడు కాదు, వాణిజ్య లాభాల కోసం డిపాజిట్ చేసిందంటూ ఐసీఐసీఐ చేసిన వాదనను కన్జూమర్ కమిషన్ కొట్టేసింది. తమ ఉద్యోగులు చేసిన తప్పుకు బ్యాంకే బాధ్యత వహించి ఆ మొత్తం చెల్లించాలని ఆదేశించింది.

2687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles