ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా సందీప్ బక్షీ

Fri,October 5, 2018 07:29 AM

icici bank new ceo sandeep bakhshi

న్యూఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో పదవికి చందా కొచ్చర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బంధుప్రీతి, అవినీతి ఆరోపణల్ని కొచ్చర్ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో తప్పని సరిగా రాజీనామా చేయాల్సివచ్చింది. కొచ్చర్ స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ నూతన ఎండీ, సీఈవోగా సందీప్ బక్షీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా ఉన్నారు. ఐదేండ్ల కాలానికిగాను బక్షీ ఎన్నికవ్వగా, 2023 అక్టోబర్ 3దాకా ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ ఓ ప్రకటన చేసింది. 1986లో ఐసీఐసీఐ లిమిటెడ్‌లో బక్షీ తన కెరియర్‌ను ఆరంభించారు. చండీగఢ్‌లోని పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.

1053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles