పీఎన్‌బీ స్కామ్.. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చార్‌కు సమన్లు

Tue,March 6, 2018 11:22 AM

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చార్, యాక్సిస్ బ్యాంక్ ఎండీ షిక్కా శర్మాలకు సమన్లు జారీ చేశారు. యాంటీ ఫ్రాడ్ ఏజెన్సీ ఈ సమన్లు జారీ చేసింది. పీఎన్‌బీలో జ‌రిగిన 13వేల కోట్ల స్కామ్‌కు సంబంధించి ఈ స‌మ‌న్లు జారీ చేశారు. వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ ఆ స్కామ్‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం నీరవ్ మోదీ పరారీలో ఉన్నారు. పీఎన్‌బీ స్కామ్ కేసులో ముంబై బ్రాంచ్‌కు చెందిన ఓ మాజీ ఆఫీసర్‌ను ఇప్పటికే సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. గత ఏడాది ఫార్చూన్ మ్యాగ్జిన్ శక్తివంతమైన మహిళల జాబితాలో చందా కొచ్చార్ పేరును వెల్లడించిన విషయం తెలిసిందే. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) ఈ సమన్లు జారీ చేసింది. నీరవ్ మోదీకి సంబంధించిన గీతాంజలి జ్వలర్స్‌కు రుణాలు జారీ చేసిన కేసులో కొచ్చార్‌ను విచారిస్తున్నట్లు తెలిసింది.


పీఎన్‌బీ స్కామ్‌తో సంబంధం ఉన్న మొత్తం 31 బ్యాంక్‌లకు సమన్లు జారీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, కరూర్ వైశ్యా బ్యాంక్ అధికారులకు కూడా సమన్లు జారీ చేశారు. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో కొచ్చార్‌ను విచారిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. గీతాంజ‌లి గ్రూపు బ్యాంకింగ్ ఆప‌రేష‌న్స్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ చిటాలియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆయ‌న్ను సీబీఐ మ‌రింత విచారించ‌నున్న‌ది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆయ‌న్ని అదుపులోకి తీసుకున్నారు.

2171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles