మీ ప్రేమ ప్రేరణగా నిలవాలి.. ఐఏఎస్ దంపతులకు రాహుల్ కంగ్రాట్స్

Tue,April 10, 2018 02:46 PM

IAS toppers Tina Dabi & Athar Amir ul Shafi gets married, Rahul Gnadhi tweets best wishes

పెహల్గామ్: 2015 సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో టాప్ ర్యాంక్ సాధించిన 24 ఏళ్ల దళిత అమ్మాయి టీనా దాబి, అదే ఏడాది రెండవ ర్యాంక్ సాధించిన అత్తర్ అమిర్ ఉల్ షఫిలు పెళ్లి చేసుకున్నారు. కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో వాళ్ల మ్యారేజ్ సోమవారం ఘనంగా జరిగింది. ఓ దళిత అమ్మాయి ఐఏఎస్‌లో ట్యాప్ ర్యాంక్ కొట్టడం మొదటిసారి. అయితే ఆ ఐఏఎస్ ఆఫీసరే ఇప్పుడు తన బ్యాచ్‌మెట్ అయిన ముస్లిం ఆఫీసర్‌ను పెళ్లి చేసుకున్నది. ఈ కొత్త దంపతులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ కంగ్రాట్స్ చెప్పారు. మీ మధ్య ప్రేమ మరింత చిగురించాలని, అసహనం పెరుగుతున్న ఈ రోజుల్లో మీ కలయిక భారతీయులకు ఆదర్శంగా నిలువాలని ఆశిస్తున్నట్లు రాహుల్ ట్వీట్ చేశారు. దేవతలు మిమ్ముల్ని దీవించాలని కోరుకుంటున్నట్లు రాహుల్ తెలిపారు. ఢిల్లీకి చెందిన దళిత ఐఏస్ ఆఫీసర్ అయిన టీనా దాబి .. కశ్మీర్ ఆఫీసర్ అత్తర్‌ను పెళ్లి చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చాంశమైంది. ఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజీలో టినా చదువుకున్నది. టాప్ ర్యాంకర్లు ఇద్దరూ వేర్వేరు మతస్థులు కావడం వల్ల ఇద్దరిపైనా విమర్శలు వచ్చాయి. కానీ అవేమి పట్టించుకోకుండానే వాళ్లు ఒక్కటయ్యారు. ఇద్దరూ రాజస్థాన్ క్యాడర్‌లో ఐఏఎస్‌గా పనిచేస్తున్నారు.1570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles