నేలకూలిన మరో జాగ్వార్

Fri,June 8, 2018 02:58 PM

IAFs Jaguar fighter jet develops technical snag

జామ్‌నగర్: భారతీయ వైమానిక దళానికి చెందిన జాగ్వార్ విమానం జామనగర్‌లో కూలింది. ల్యాండింగ్‌కు ముందు విమానంలో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఇవాళ ఉదయం 9.20 నిమిషాలకు ఈ సంఘటన జరిగింది. శిక్షణ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించారు. రెండు రోజుల క్రితమే కచ్‌లోనూ ఓ విమానం కూలింది. ఆ ఘటనలో ఎయిర్ కమాండెంట్ సంజయ్ చౌహాన్ ప్రాణాలు కోల్పోయాడు. కచ్‌లోని ముంద్ర దగ్గర ఉన్న బరేజా గ్రామంలో ఆ ప్రమాదం జరిగింది. జాగ్వర్.. ఓ ట్విన్ ఇంజిన్ విమానం. సింగిల్ సీటర్. దీని గరిష్ట వేగం గంటకు 1350 కిలోమీటర్లు. ఈ యుద్ధ విమానానికి రెండు 30ఎంఎం గన్స్ ఉంటాయి. రెండు ఆర్-350 మ్యాజిక్ సీసీఎంలను మోసుకెళ్లగలదు. అదనంగా మరో 4750 కిలోల బాంబులు లేదా ఇంధనాన్ని మోసుకెళ్తుంది.

2343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS