వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ప్రొఫైల్‌..

Wed,February 27, 2019 06:09 PM

IAF Vikram Abhinandan profile

హైదరాబాద్‌ : పాకిస్థాన్‌ కస్టడీలో ఉన్న వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. అభినందన్‌ తండ్రి రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌. తమిళనాడులోని ఉడుమలైపేటలోని సైనిక్‌ స్కూల్‌లో అభినందన్‌ చదివారు. అభినందన్‌ కుటుంబం చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్‌ అకాడమిలో నివసిస్తోంది.

పాకిస్థాన్‌ యుద్ధ విమానాన్ని వెంటాడి కూల్చిన తర్వాత.. భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 పాక్‌ భూభాగంలో కుప్పకూలిపోయింది. ఈ మిగ్‌-21 కూలిపోయినప్పుడు అందులో ఉన్న వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ ప్యారాచూట్‌ సహాయంతో పాక్‌ భూభాగంలో పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా విక్రమ్‌ అభినందన్‌ను పాక్‌ బలగాలు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నాయి.

9280
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles