పాకిస్థాన్ ఎఫ్-16 విమానాన్ని కూల్చేసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

Wed,February 27, 2019 12:28 PM

IAF shot down Pakistans F 16 fighter jet after it violates Indian Air space

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడులు చేసిన మరుసటి రోజే మరోసారి తోక జాడించడానికి ప్రయత్నించింది దాయాది దేశం. తమ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16 విమానాలను భారత గగనతలంలోకి పంపించింది. అయితే వెంటనే స్పందించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. పాక్ విమానాలను తరిమి కొట్టింది. ఈ క్రమంలో ఓ ఎఫ్-16 విమానాన్ని ఐఏఎఫ్ కూల్చేసింది. నౌషేరా సెక్టార్లోని లామ్ లోయలో ఈ ఘటన జరిగింది. పాక్‌కు చెందిన ఎఫ్-16 విమానం కూలుతున్నట్లు అక్కడి వాళ్లు గమనించారు. ఆ వెంటనే ఓ పారాషూట్ కూడా కనిపించింది. పైలట్ చనిపోయాడా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ పాకిస్థాన్ మాత్రం ఎప్పటిలాగే విరుద్ధమైన ప్రకటనలు చేసి తమ పరువు కాపాడుకునే ప్రయత్నం చేసింది. పాక్ ఎయిర్‌ఫోర్సే రెండు ఐఏఎఫ్ విమానాలను కూల్చేసిందని, ఓ ఇండియన్ పైలట్‌ను అరెస్ట్ కూడా చేశామని ఆ దేశ మేజర్ జనరల్ గఫూర్ చెప్పడం విశేషం.

10113
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles