HomeLATEST NEWSIAF lifts temporary airspace restrictions, imposed after Balakot

ఎయిర్‌స్పేస్ ఆంక్ష‌లు ఎత్తివేసిన ఐఏఎఫ్‌

Published: Sat,June 1, 2019 09:52 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైద‌రాబాద్‌: భార‌త వైమానిక ద‌ళం అన్ని ఆంక్ష‌ల‌ను ఎత్తివేసింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 19వ తేదీన తాత్కాలికంగా వైమానిక ద‌ళం భార‌త ఎయిర్‌స్పేస్‌పై కొన్ని ఆంక్ష‌ల‌ను విధించింది. బాలాకోట్ దాడి త‌ర్వాత ఆ ఆంక్ష‌ల‌ను విధించారు. వాటిని ఎత్తివేస్తున్న‌ట్లు ఐఏఎఫ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. పాక్‌లో బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్ర‌వాద సంస్థ స్థావ‌రాల‌పై మిరేజ్ యుద్ధ విమానాలు దాడి చేసిన త‌ర్వాత భార‌త్ ఎయిర్‌స్పేస్‌పై కొన్ని ఆంక్ష‌లు విధించారు. పుల్వామా ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా ఐఏఎఫ్ దాడులు చేసింది. ఆ త‌ర్వాతే ఆంక్ష‌లు అమ‌లు చేశారు.


1144
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology