సుబన్ సిరి వ్యాలీపైకి 80 టన్నుల సామాగ్రి..

Tue,February 12, 2019 07:00 PM

అరుణాచల్ ప్రదేశ్ : అరుణాచల్ ప్రదేశ్ లో హురి-డామిన్ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ కోసం క్యూమి నదిపై వంతెనను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ వో) ఈ వంతెన నిర్మాణ పనులను చేపడుతోంది. లోయ ప్రాంతం కావడంతో బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం అవసరమైన సామాగ్రిని చేర్చే బాధ్యతను ఐఏఎఫ్ (భారత వైమానిక దళం) తీసుకుంది. ఐఏఎఫ్ సిబ్బంది వంతెన నిర్మాణ సామాగ్రిని ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ ద్వారా సుబన్ సిరి వ్యాలీపైకి చేర్చుతున్నారు. ఇప్పటివరకు ఐఏఎఫ్ బృందం 80 టన్నుల నిర్మాణ సామాగ్రిని వ్యాలీపైకి చేర్చారు. వంతెన నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజల ఎంతో ప్రయోజనం కలగనుంది. ఈ వంతెన ద్వారా రిమోట్ ఏజెన్సీ ప్రాంతాలకు భద్రతాదళాలు సులభంగా చేరుకోనున్నాయి.1849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles