పాకిస్థాన్ సరిహద్దులో దూసుకెళ్లిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్స్

Fri,March 15, 2019 04:47 PM

IAF Fighter Jets carried readiness exercise along Pakistan Border

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు సద్దుమణిగినట్లే కనిపిస్తున్నాయి. ఒక దశలో యుద్ధ వాతావరణం నెలకొన్నా.. భారత పైలట్ అభినందన్‌ను పాక్ రెండు రోజుల్లోనే విడుదల చేయడంతో క్రమంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అయితే సరిహద్దుల్లో మాత్రం భారత బలగాలు తమ కసరత్తులు కొనసాగిస్తున్నాయి. తాజాగా గురువారం రాత్రి జమ్ము, పంజాబ్ రాష్ర్టాల్లోని సరిహద్దుల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సంసిద్ధత కసరత్తులు నిర్వహించింది. ఇందులో ఐఏఎఫ్‌కు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్స్ పాల్గొనడం విశేషం. సూపర్‌సానిక్ స్పీడ్‌తో ఈ జెట్స్ గాల్లో దూసుకెళ్లాయి. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ మరో దుస్సాహసానికి తెగబడితే తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉండటంలో భాగంగా ఈ డ్రిల్ నిర్వహించినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. బాలాకోట్‌లో దాడులు చేసిన వచ్చినప్పటి నుంచీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హైఅలెర్ట్‌లో ఉంది. మరుసటి రోజే పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ భారత గగనతలంలోకి దూసుకొచ్చినా.. వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. రెండు రోజుల కిందట మరోసారి పాక్‌కు చెందిన ఫైటర్ జెట్స్ ఎల్‌వోసీకి పది కిలోమీటర్ల దూరంలో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సూపర్‌సోనిక్ స్పీడ్‌తో దూసుకెళ్లాయి. దీంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కూడా కసరత్తులు మొదలుపెట్టింది.

4142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles