రాఫేల్ కొనుగోలును సమర్థించిన ఐఏఎఫ్

Wed,September 12, 2018 11:56 AM

IAF chief defends emergency procurement of Rafale jets

న్యూఢిల్లీ: రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలును భారత వైమానిక దళం సమర్థించింది. రాఫేల్ కొనుగోలుపై వివాదం నెలకొనడంతో.. ఈ అంశంపై ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా స్పందించారు. ఎమర్జెన్సీ కింద 36 రాఫేల్ జెట్లను కొనుగోలు చేయడం అవసరమని ఆయన అన్నారు. రాఫేల్‌తో పాటు ఎస్-400 రక్షణ ఆయుధాలతో వైమానిక దళాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు. వైమానిక దళంలో తగ్గుతున్న సంఖ్య కొరతను తీర్చేందుకు రాఫేల్ ప్రొక్యూర్‌మెంట్ అవసరమన్నారు. 2016లో పారిస్ వెళ్లిన మోదీ.. అక్కడ రాఫేల్ విమానాల కోనుగోలుపై ఒప్పందం కుదుర్చుకున్నారు.

768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles