పార్టీ చీఫ్‌ ఎంపిక‌లో జోక్యం చేసుకోను: రాహుల్ గాంధీ

Thu,June 20, 2019 03:17 PM

I wont decide next Congress President, Rahul Gandhi confirms his exit plans

హైద‌రాబాద్: తాజాగా ముగిసిన‌ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ప‌రాభ‌వాన్ని ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. ఆ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల రాహుల్ గాంధీ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌న్నారు. దాని గురించి ఇవాళ కూడా రాహుల్ ఓ కామెంట్ చేశారు. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఎవ‌రు పోటీప‌డ్డా.. తాను మాత్రం దానికి అడ్డుప‌డేది లేద‌న్నారు. త‌న త‌ర్వాత కాంగ్రెస్ ప్రెడిడెంట్ ఎవ‌ర‌న్న దానిపై తానేమీ నిర్ణ‌యం తీసుకోవ‌డం లేద‌ని రాహుల్ అన్నారు. కొత్త అధ్య‌క్షుడి ఎన్నిక విష‌యంలో అకౌంట‌బులిటీ ఉండాల‌న్నారు. ఎంపిక ప్ర‌క్రియ‌లో జోక్యం చేసుకుంటే బాగుండ‌ద‌న్నారు. లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు కూడా రాహుల్ నిరాక‌రించారు. ఆ పోస్టు కోసం బెంగాల్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రీని నియ‌మించారు. అయితే అధ్య‌క్ష బాధ్య‌త‌లను రాహుల్ నిర్వ‌ర్తిస్తారా లేదా అన్న దానిపై సందిగ్ధం నెల‌కొన్న‌ది.

717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles