నేను సైనికుడిని.. ఆయన క్రికెటర్.. తప్పుగా భావించకండి!

Tue,February 19, 2019 12:49 PM

I was a soldier and he was a cricketer says Amarinder Singh on Sidhus comments

చండీగఢ్: పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్థాన్‌ను సమర్థించేలా మాట్లాడిన పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూని వెనకేసుకొచ్చారు ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, సిద్దూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంటుందని అమరీందర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ పర్యటన విషయంలో సిద్దూ కాస్త ఎక్కువే స్పందించారని ఆయన అభిప్రాయపడ్డారు. సిద్దూ ఓ క్రికెటర్, నేను ఓ సైనికుడిని. అందువల్ల ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగానే ఉంటాయి. దేశ రక్షణ చిక్కుల గురించి అర్థం చేసుకోలేక సిద్దూ అలా మాట్లాడి ఉంటారు. అయితే ఆయన కచ్చితంగా జాతి వ్యతిరేకి అయితే కాదు. ఈ వ్యాఖ్యల ఫలితం ఆయనకు తెలిసే ఉంటుంది అని అమరీందర్ అన్నారు. పంజాబ్ అసెంబ్లీలో శిరోమణి అకాలీదళ్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే రభస సృష్టించిందని విమర్శించారు. బడ్జెట్‌లాంటి ముఖ్యమైన అంశం చర్చకు వచ్చిన సమయంలో కావాలనే సిద్దూ అంశాన్ని తెరపైకి తెచ్చి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

2071
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles