నీ భార్య,కొడుకుని కాల్చేశా.. జడ్జికి ఫోన్..వీడియో

Sun,October 14, 2018 08:03 AM

I Shot Your Wife And Son Guards Chilling Call To Gurgaon Judge

గుర్గావ్: మహిపాల్ సింగ్ అనే వ్యక్తిగత భద్రతా అధికారి గుర్గావ్ అడిషినల్ షెషన్స్ జడ్జి కృష్ణకాంత్ శర్మకు ఫోన్ చేసి నీ భార్య, కొడుకుని కాల్చేసినట్లు పేర్కొన్నాడు. జడ్జి వద్ద ఇతడు గత రెండు సంవత్సరాలుగా సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నాడు. తల్లి రీతూ(38), కొడుకు ధ్రువ్(18) ఇద్దరూ షాపింగ్‌కు గురుగావ్ సెక్టార్ 49లో గల మార్కెట్‌కు మహిపాల్ సింగ్‌తో కలిసి వెళ్లారు. అందరూ చూస్తుండగానే మహిపాల్ ఇరువురిపై తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. బాధితులిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. కొడుకు ధ్రువ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల అనంతరం హోండా సిటీ కారుతో పరారైన మహిపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులు జరపడానికి గల కారణం స్పష్టంగా చెప్పనప్పటికి తీవ్రమైన నిరాశ, మానసిక వేదనలో ఈ చర్యకు పాల్పడ్డట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనంప ప్రకారం మహిపాల్ తన సర్వీసు రివాల్వర్‌ను తీసుకుని అతి సమీపం నుంచి మొదట జడ్జి భార్యను ఛాతీలో అనంతరం కొడుకును తలలో కాల్చినట్లు తెలిపారు. నిందితుడు మహిపాల్ హర్యానాలోని మహేంద్రఘర్ నివాసి. ఇతడి భార్య టీచర్. ఏడేళ్లు, మూడేండ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు.7166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles