నేను మగాళ్లతో పడుకోను.. నాకు భార్య ఉంది..!

Fri,March 22, 2019 12:55 PM

I do not sleep with men says Karnataka speaker Ramesh Kumar over feud with Muniyappa

బెంగళూరు: ఈ మాటలన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ ఓ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్. అది కూడా పబ్లిగ్గా మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేయడం షాక్‌కు గురి చేసింది. కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య గొడవ మరోసారి బజారున పడేసిన ఘటన ఇది. అక్కడి నేతలు మునియప్ప, రమేష్ కుమార్ మధ్య కొన్నాళ్లుగా లోక్‌సభ నియోజకవర్గం విషయమై మాటల యుద్ధం నడుస్తున్నది. దీనిపై గత ఫిబ్రవరిలో మునియప్ప స్పందిస్తూ.. రమేష్‌కుమార్‌కు, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం భార్య, భర్తల్లాంటోళ్లం అని అన్నారు. దీనిపై గురువారం రమేష్‌కుమార్ స్పందించారు. నేను మగాళ్లతో పడుకోను. నాకూ ఓ భార్య ఉంది. ఆయనకు ఆ ఆసక్తి ఉందేమో కానీ నాకు లేదు అని మీడియాతో స్పీకర్ రమేష్‌కుమార్ అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వానికి మునియప్పపై ఫిర్యాదు కూడా చేశారు. కోలార్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై ఇద్దరి మధ్య చాలా కాలంగా గొడవ జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏడుసార్లు ఎంపీగా చేసిన మునియప్పకే ఈసారీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నా.. రమేష్‌కుమార్‌తోపాటు ఇతర ఎమ్మెల్యేలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఆడియో టేపుల విషయంలోనూ తనపై ఆరోపణలు రాగా.. తన పరిస్థితి అత్యాచార బాధితురాలిలా మారిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రమేష్ కుమార్. ఆ తర్వాత పార్టీ ఒత్తిడితో క్షమాపణ చెప్పారు.

5963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles