30 ఏళ్లుగా ఒక్క సినిమా కూడా చూడలేదు: ఆర్మీ చీఫ్

Wed,July 4, 2018 05:35 PM

I did not watch a movie in past 30 years says Army Chief Bipin rawat

న్యూఢిల్లీ: 30 ఏళ్లుగా తాను ఒక్క సినిమా కూడా చూడలేదని చెప్పారు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ స్కూల్ చిన్నారులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు. హిందీలో వస్తున్న దేశభక్తి సినిమాల గురించి మీరేమంటారు అని ఓ 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రశ్నించగా.. ఆయన ఇలా సమాధానమిచ్చారు. 30 ఏళ్లుగా ఒక్క సినిమా కూడా చూసే సమయం దొరకలేదు. ఒకే చోట 3 గంటలకు కూర్చునే వీలు కూడా నాకు లేదు అని రావత్ అన్నారు. విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా ఆర్మీ గురించిన విశేషాలు వివరించడంతోపాటు జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులనూ వివరించారు.

చదువులో అయినా, జీవితంలో అయినా ఓటమి సహజమని, ఎప్పుడూ నమ్మకం కోల్పోకూడదని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. మీరే దేశ భవిష్యత్ ఆశా కిరణాలు. కష్టపడండి. ఎప్పుడూ నమ్మకం కోల్పోవద్దు. ఎన్ని ఓటములు ఎదురైనా వెనకడుగు వేయొద్దు. విజయానికి కఠోర శ్రమే కీలకం అని రావత్ స్పష్టంచేశారు. ఈ 20 మంది చత్తీస్‌గడ్‌కు చెందిన విద్యార్థులు వారం రోజుల ఉత్తర భారత పర్యటనకు వచ్చారు. వీళ్లు డెహ్రాడూన్‌లోని మిలిటరీ అకాడమీని కూడా సందర్శించనున్నారు.

2309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles