నేను నిర్దోషిని: రాకీ యాదవ్

Tue,May 10, 2016 07:02 PM

I am innocent.I was not in the city that day:Rocky Yadav

బీహార్: గయ నగరంలో ఆదిత్య అనే యువకుడిని అధికార జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవి కుమారుడు రాకీ యాదవ్ నడిరోడ్డుపై కాల్చి చంపాడని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రాకీ యాదవ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై రాకీ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. అసలు తాను సంఘటన జరిగిన రోజు గయలోలేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్నానని వివరించారు. తనపై ఆరోపణలు రావడంతో తన తల్లి పిలిపిస్తే పోలీసుల ఎదుట హాజరుకావడానికి వచ్చానని పేర్కొన్నారు. తాను నిర్దోషినని, ఎవరిపై కాల్పులు జరపలేదని తెలిపారు. కేసులో నిందితునిగా ఉన్న రాకీయాదవ్‌ను పోలీసులు ఫామ్ హౌజ్‌లో ఉండగా అరెస్టు చేశారు. రాకీ యాదవ్‌కు బీహార్‌లోని కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

1242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles