హైదరాబాద్ నుంచి కొత్త రూట్లకు విమాన సర్వీసులు

Sat,March 16, 2019 06:14 AM

hyderabad gorakhpur indigo flight start from 14th april 2019

న్యూఢిల్లీ : చౌకవిమానయాన సంస్థ ఇండిగో మరో మూడు నూతన రూట్లకు విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. వీటిలో హైదరాబాద్-గోరఖ్‌పూర్‌తోపాటు చెన్నై-రాయ్‌పూర్, కోల్‌కతా-గోరఖ్‌పూర్‌ల మధ్య విమాన సర్వీసును వచ్చే నెల నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వీటితోపాటు చెన్నై-త్రివేండ్రమ్, బెంగళూరు-మంగళూరు, బెంగళూరు-ఉదయ్‌పూర్, బెంగళూరు-చెన్నైల మధ్య కూడామరిన్ని సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. వచ్చే నెలలో 14 నూతన విమానాలతో సర్వీసులు అందించనుండటం సంతోషంగా ఉన్నదని, వీటిలో మూడు కొత్త రూైట్లెన చెన్నై, రాయ్‌పూర్, గోరఖ్‌పూర్‌ల మధ్య విమానాలను నడుపనున్నట్లు ఇండిగో చీఫ్ కమర్షియల్ అధికారి విలియమ్ బౌల్టర్ తెలిపారు. చెన్నై-రాయ్‌పూర్‌ల మధ్య విమాన సర్వీసు వచ్చే నెల 7 నుంచి అందుబాటులోకి రానున్నది. చెన్నైలో ఉదయం 10.20 గంటలకు బయలుదేరి రాయ్‌పూర్‌కు మధ్యాహ్నం 12.20 గంటలకు చేరుకోనున్నది, తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.50 గంటలకు బయలుదేరి చెన్నైకి మధ్యాహ్నం 2.25కి చేరుకోనున్నది. అలాగే వచ్చే నెల 30న హైదరాబాద్-గోరఖ్‌పూర్, కోల్‌కతా-గోరఖ్‌పూర్‌ల మధ్య విమానాన్ని ప్రారంభిస్తున్నది. హైదరాబాద్‌లో ఉదయం 9.55 గంటలకు బయలుదేరనున్న సర్వీసు గోరఖ్‌పూర్‌కు మధ్యాహ్నం 12.05 గంటలకు చేరుకోనుండగా, తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.35 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు 2.10లకు చేరనున్నది. ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో ఇండిగో 40 శాతం మార్కెట్ వాటాతో తొలిస్థానంలో ఉన్నది.

1773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles