ఫ్యాషన్ షోలో పాల్గొన్న భార్యపై కాల్పులు

Tue,April 30, 2019 10:03 AM

Husband shoots at teacher for attending fashion show at her school

న్యూఢిల్లీ : ఫ్యాషన్ షోలో పాల్గొన్న భార్యపై భర్త కాల్పులు జరిపిన సంఘటన ఢిల్లీకి సమీపంలోని గుర్‌గ్రాంలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంద్రజీత్, ఆశారాణి(32)కి దశాబ్దం కాలం కింద పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆశారాణి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో పని చేస్తుంది. ఆమె పని చేస్తున్న పాఠశాలలో ఆదివారం రాత్రి ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ షోలో ఆశారాణి పాల్గొన్నది. అయితే తన భార్య ఫ్యాషన్ షోలో పాల్గొనడం ఇంద్రజీత్‌కు ఇష్టం లేదు. మొత్తానికి ఆదివారం రాత్రి పాఠశాల వద్దకు చేరుకున్న ఇంద్రజీత్.. ఫ్యాషన్ షో నుంచి బయటకు రావాలని, ఇంటికి వెళ్దామని ఆశారాణిని అడిగాడు. ఇందుకు ఆమె తిరస్కరించడంతో.. అతని వద్ద తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇంద్రజీత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

1805
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles