టిక్‌టాక్‌‌లో అసభ్య హావభావాలు.. భార్యను హత్య చేసిన భర్త

Sun,June 2, 2019 01:29 PM

Husband killed his Wife because Of TikTok Addiction

చెన్నై: చైనాకు చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌కు భారత్‌లో విపరీతమైన క్రేజ్. అన్ని వయస్సుల వారు ఈ యాప్‌లో వినూత్న హావభావాలతో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అసభ్యకరమైన హావభావాలను పోస్ట్ చేసిన భార్యను భర్త దారుణంగా కత్తితో పోడిచి హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని కోవై సమీపంలో జరిగింది. అరివొలినగర్‌కు చెందిన కనకరాజ్(35)కు ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న నందినికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కనకరాజ్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కుటుంబ తగాదాలతో భార్యాభర్తలు రెండేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. కొద్దిరోజులుగా నందిని టిక్‌టాక్‌లో అసభ్యకరమైన హావభావాలతో వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కనకరాజ్ టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేయడం ఆపేయాలని మందలించాడు. భర్త హెచ్చరికలను పట్టించుకోకుండా అదేపనిగా వీడియోలు పోస్ట్‌చేయడానికి కనకరాజ్ తట్టుకోలేకపోయాడు.

భార్యకు ఫాలోవర్స్ పెరగడంతో భర్త తట్టుకోలేకపోయాడు. టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేయొద్దని పలుమార్లు ఫోన్‌లో గట్టిగా హెచ్చరించాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం మద్యం సేవించిన కనకరాజ్.. ఆమె పనిచేస్తున్న కళాశాలకు వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. వీరిద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో ఆవేశానికి గురైన కనకరాజ్ తనతో తీసుకెళ్లిన కత్తితో ఆమెను పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిప నందినిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

12322
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles