షాంపూ అడిగినందుకు భార్యను చితకబాదాడు..

Tue,March 19, 2019 02:53 PM

husband assaults wife for seeking money for shampoo

అహ్మదాబాద్ : షాంపూ కొనివ్వమని అడిగినందుకు ఓ భార్యను భర్త చితకబాదాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్‌లోని బావ్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం తల స్నానం చేసేందుకు సిద్ధమయ్యాను. షాంపూ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వమని తన భర్తను అడిగాను. తక్షణమే తనపై కోపం తెచ్చుకుని, అసభ్యకర పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా తీవ్రంగా కొట్టి.. తలను గోడకేసి కొట్టాడు. దీంతో విరమ్‌గామ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి భర్త రైల్వే శాఖలో క్లర్క్‌గా పని చేస్తున్నాడు. ఈ దంపతులకు పదిహేను సంవత్సరాల క్రితం వివాహమైంది. కాగా ప్రతీ చిన్న విషయానికి భార్యతో గొడవ పడటం, కొట్టడం భర్తకు అలవాటుగా మారింది.

3576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles